హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ వ్యవహారంలో నటుడు ప్రకాశ్‌రాజ్ బుధవారం సిట్ విచారణకు హాజరయ్యారు. సిఐడి కార్యాలయంలో ఆయన్ని అధికారులు అన్ని కోణాల్లో ప్రశ్నించారు. అనంతరం ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. 2016లో ఓ యాప్‌నకు ప్రమోషన్ చేశానని.. అది 2017లో బెట్టింగ్ యాప్‌గా మారిందని అన్నారు. వెంటనే యాప్‌తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని తెలిపారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే అని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. అందుకు క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు.
బెట్టింగ్ యాప్ స్కాంలో గతంలో ఇడి తనను విచారించిందని.. ఆ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తాను ఎలాంటి పేమెంట్ తీసుకోలేదని అధికారులకు వివరించానని తెలిపారు. ఇతర బెట్టింగ్ యాప్‌లకు ఏమైనా చేశారా అని అధికారులు అడిగిన ప్రశ్నకు లేదని చెప్పానని అన్నారు. బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన వివరాలు కూడా సమర్పించానని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చిన దాంట్లో ఏమీ లేదని తెలిసిందని అన్నారు. బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు పాడై పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.