కోల్‌కతా: భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా ఆతిథ్య దేశంతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి-20ల్లో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 14వ తేదీ నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు ఈ మ్యాచ్ కోసం కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించి వాతావరణ శాఖ కీలక విషయం వెల్లడించింది. ఇది ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ అనే చెప్పుకోవాలి. తొలి టెస్ట్ మ్యాచ్ వర్షం ఆటంకం కలిగించే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. చిన్న చిన్న జల్లులు పడవచ్చని. ఆ అవకాశం కూడా తక్కువే అని పేర్కొంది. మైదానంలో ఉష్ణోగ్రత దాదాపు 28 డిగ్రీలుగా ఉండనుందని వివరించింది.
ఇక పిచ విషయానికొస్తే.. ముందు పేసర్లకు, ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలించే విధంగా ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా 44సార్లు టెస్టుల్లో తలపడగా.. దక్షిణాఫ్రికా 18సార్లు, భారత్ 16 సార్లు విజయం సాధించాయి. 10 మ్యాచులు డ్రాగా ముగిశాయి. స్వదేశంలో టీం ఇండియా 11 మ్యాచులు గెలిచింది.