హైదరాబాద్: టి20ల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు అభిషేక్ శర్మ. ఆసియా కప్, ఆస్ట్రేలియాలో టి20లో సిరీస్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థులను హడలెత్తించాడు. అభిషేక్ శర్మ క్రీజులో ఉంటే ప్రత్యర్థి టీమ్ గజగజ వణికిపోతుంది. తాజాగా ‘ఇట్ విల్ హ్యాపెన్’ అంటూ తన చేతిపై టాటూ వేయించుకున్నాడు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. పోస్టు పెట్టిన పది గంటల్లోనే లక్షలలో లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం అభిషేక్ 925 పాయింట్లతో టి20ల్లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. 849 పాయింట్లతో ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో ఉండగా 788 పాయింట్లతో తిలక్ వర్మ మూడో స్థానంలో, 696 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం టి20ల్లో ఎవరికి అందనంత ఎత్తుల్లో శర్మ కనిపిస్తున్నాడు. అందరూ మరో రోహిత్ శర్మ దొరికాడని భావించారు. రోహిత్ శర్మ వారసత్వానికి కొనసాగిస్తూనే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అభిషేక్ శర్మను వరించింది.