హీరో అల్లరి నరేష్ నటిస్తున్న థ్రిల్లర్ ‘12ఎ రై ల్వే కాలనీ’ సినిమాను నాని కాసరగడ్డ ద ర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీ నివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్‌తో పాపులరైన డాక్ట ర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశా రు. తాజాగా లాంచ్ చేసిన 12ఎ రైల్వే కాలనీ ట్రై లర్ మిస్టరీ మర్డర్స్ సిరీస్ చుట్టూ తిరిగుతూ ఆ ద్యంతం ఆకట్టుకుంది. దర్శకుడు నాని కాసరగ డ్డ… డా. విశ్వనాథ్ రాసిన థ్రిల్లింగ్ కథను తెరపై సస్పెన్స్‌తో అద్భుతంగా చూపించారు. అల్లరి నరే ష్ ఈసారి తన కామెడీ ఇమేజ్‌కి భిన్నంగా, ఇం టెన్స్ ఎమోషన్స్‌తో అదరగొట్టారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “చాలా మల్టీ లేయర్స్ ఉండే కథ ఇది. ఏ కథ ఎ టు నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డై రెక్టర్ నాని సినిమాని చాలా అద్భుతంగా తీశా డు. సినిమాలో కామాక్షి చాలా సహజంగా నటించింది. ఈ సినిమా చూసి రెండు, మూడు చోట్ల జర్క్ అవుతారు. అందరూ థియేటర్స్‌కి వచ్చి సి నిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు.
డైరెక్టర్ నాని మా ట్లాడుతూ “సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు. షో రన్నర్ అనిల్ మాట్లాడుతూ “మంచి కథ, కాన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వస్తున్న సినిమా ఇది. నరేష్ లేకపోతే ఇదొక చిన్న కథగా అయిపోయేది. ఆయన ఓకే చేశారు కాబట్టి ఇంత డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమా చూడబోతున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్స్‌ని ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కి ఇది మంచి ట్రీట్‌లా ఉండబోతుంది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు”అని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మా ట్లాడుతూ “ ఈ సినిమాలో వాట్ నెక్స్ అనేది మనం ఎవరు కూడా ఊహించలేము. నాకు ఒక డిఫరెంట్ మ్యూజిక్ చేయడానికి స్కోప్ ఇచ్చిన సినిమా ఇది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కామాక్షి, నిర్మాత శ్రీనివాస చిట్టూరి, జీవన్ కుమార్ పాల్గొన్నారు.