ఎస్‌ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవం. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్‌పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రె డ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భం గా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కిం గ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడు తూ “నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇ ష్టం. నాన్నగారి సినిమా మూగ మనసులతో నాకు బాగా ఇష్టం. నేను అదే ఇష్టంతో జానకి రాముడు సినిమా చేశాను. గత వైభవం నాలుగు తరాల క థ. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
హీరో దుష్యంత్ మా ట్లాడుతూ “గత వైభవం సినిమా కథ, స్క్రీన్ ప్లే చా లా కొత్తగా ఉంటుంది. చాలా బిగ్ కాన్వాస్ సిని మా ఇది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను”అని తెలియజేశారు. డైరెక్టర్ సింపుల్ సుని మాట్లాడుతూ “గత వైభవం డిఫరెం ట్ జానర్ సిని మా. అన్ని కమర్షియల్ విలువలు ఉన్న ప్రయోగాత్మక చిత్రమిది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఆషికా రంగనాథ్, చైతన్య రెడ్డి, దీపక్, విలియం డేవిడ్ పాల్గొన్నారు.