మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ పికెల్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పా ల్గొనే తెలంగాణ జట్టును ప్రకటించారు. మంగళవారం జట్టు వివరాలను రా ష్ట్ర పికెల్‌బాల్ సంఘం వెల్లడించింది. బెంగళూరు వేదికగా జరిగే ఈ టోర్నీ కోసం 46 మందితో కూడిన తెలంగాణ జట్టును ఎంపిక చేశారు. రాష్ట్ర జట్టు కు నంబర్‌వన్ ర్యాంక్ క్రీడాకారుడు సమీర్ వర్మ సారథ్యం వహించనున్నా డు. ఈ పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు సంబంధించిన జెర్సీని రాష్ట్ర క్రీడా శా ఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి జయేష్ రంజన్ సచివాలయంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పికెల్‌బాల్ సంఘం కాదర్యర్శి, ఒలింపియన్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.