పట్న: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఘనవిజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఘోషిస్తున్నాయి. 8 ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ నే విజయం సాధిస్తోందని అంచనా వేశాయి. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీ లో ఎన్డీఏ 135 నుంచి 160 సీట్లను గెలుచుకుంటుందని దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మాట్రిజ్ అంచనా ప్రకారం ఎన్డీ ఏ 147 నుంచి 167 మధ్య సీట్లు గెలుచుకుంటుంది. బీహార్‌లో అధికారం అందుకోవాలం టే మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు చాలు. కా నీ తొలిసారి రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ప్రశాంత్ కిషోర్ ప్రజలను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. మ్యాట్రిజ్ ప్రకా రం జెఎస్ పీ గెలిచే స్థానాలు. 2 సీట్లు కూ డా మించదు. దైనిక్ భాస్కర్ ప్రకారం ఆ పా ర్టీకి 0నుంచి 3కి మించవు. చాణగ్య స్ట్రాటజీ స్, దైనిక్ భాస్కర్, జెవిసి, మ్యట్రిజ్, పి- మా ర్క్, పీపుల్స్ ఇన్ సైట్ సహా అన్ని పోల్ స్టర్లు ప్రశాంత్ కిషోర్ పార్టీకి 2 సీట్ల కన్నా ఎక్కు వ రావని స్పష్టం చేశాయి. జేవీసీ ఎగ్జిట్ పోల్ ప్రకారం
ఎన్డీఏ 135 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుంది. పీపుల్స్ పల్స్, పీపుల్స్ ఇన్ సైట్ మాత్రం బీజేపీ -జెడియు కూటమికి 133 స్థానాలు దక్కుతాయని పేర్కొన్నాయి. దాదా పు అన్ని ఎగ్జిట్ పోల్స్ మహా ఘట్బంధన్ కు రెండో స్థానం ఇచ్చాయి. దైనిక్ భాస్కర్ ప్రకా రం మహాఘట్బందన్ కు 71 నుంచి 91 సీట్లవరకూ దక్కవచ్చు. జేవిసి ప్రకారం 88 నుం చి 103 స్థానాలు లబించే అవకాశం ఉంది . ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల సెంటిమెంట్, అభిప్రాయాలు క్రోడీకరించి ప్రివ్యూలు అందిస్తున్నా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తరచుగా తప్పు అ వుతాయని తెలిసిందే. అందువల్ల కాస్త అటు ఇటుగా ఫలితాలు ఉండవచ్చు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ఈ ఎన్నికలు బీహార్‌లో ఒక శకానికి ముగింపు పలుకుతాయి. దాదాపు 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న జేడి(యు) అధినేత నితిశ్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలని ప్రచారం సాగుతోంది. మ రో పక్క ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాద వ్ పార్టీ పగ్గాలను తన కొడుకు తేజశ్వీయాదవ్‌కు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు.