లండన్ : హంగేరీకి చెందిన బ్రిటిష్ రచయిత 51ఏళ్ల డేవిడ్ సలై తన ఫ్లెష్ అనే నవలకు గాను 2025 బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. సోమవారం రాత్రి బుకర్‌ప్రైజ్ వేడుకలో భారతీయ రచయిత కిరణ్ దేశాయ్ రాసిన ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నవల తీవ్ర పోటీ ఇచ్చినప్పటికీ డేవిడ్ రాసిన నవలకే అవార్డు దక్కింది. సలై తుదిపోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించి బుకర్ ప్రైజ్‌కు ఎంపిక కావడం విశేషం. ఈమేరకు డేవిడ్ సలైకు సుమారు 50 వేల పౌండ్ల నగదు పారితోషికం అందజేశారు. గత ఏడాది విన్నర్ సమంతా హార్వే చేతుల మీదుగా ట్రోఫీని బహూకరించారు.