మన తెలంగాణ, సిటిబ్యూరో/శంషాబాద్: ఢిల్లీ లో పేలుళ్లు జరగడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రా లను అప్రమత్తం చేసింది. దీంతో నగర పోలీసు లు తనిఖీలు చేపట్టారు. సున్నిత ప్రాంతాల్లో పో లీసులను మోహరించారు, ఎలాంటి సంఘటన లు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముం దస్తుగా చర్యలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ని యోజకవర్గానికి ఉప ఎన్నికలు మంగళవారం జ రగనుండడంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్న పోలీసులు పేలుళ్ల తో మరింత అప్రమత్తం అయ్యారు. నగరానికి చెందిన వైద్యుడిని పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో గుజరాత్ ఎటిఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన మరుసటి రోజే ఢిల్లీలో పేలుళ్లు జరగడం తో వైద్యుడి అరెస్టుకు దానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీస్ ఉన్నతాధి కారులు ఆరా తీస్తున్నారు. గుజరాత్ ఎటిఎస్ పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను విచారించ గా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడాలని ప్లాన్ వేసినట్లు ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారు. ప్ర ధానంగా జనరద్దీ ప్రాంతాలైన ప్రధాన బస్టాండ్ లు ఎంజిబిఎస్, కోఠి, ఆబిడ్స్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నగరంలోని అన్ని జోన్లలో పెట్రోలింగ్‌ను పెంచారు. రవాణా మార్గాలు, మార్కెట్లు, మాల్స్, మెట్రో స్టేషన్‌ల వద్ద వాహన తనిఖీలు చేశారు. సైబర్ టీమ్‌లు సోషల్ మీడియా మానిటరింగ్ చేస్తున్నా యి. ‘ఢిల్లీ ఘటనతో మేము అలర్ట్‌లో ఉన్నాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అనుమానాస్పద కార్యక లాపాలు కనిపిస్తే 100 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. సెంట్రల్, సౌత్, ఈస్ట్ జోన్లలో ప్రత్యేక స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. పాతబస్తీ, హైటెక్ సిటీ, హుస్సేన్ సాగర్ వంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో సిసిటివీలు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఢిల్లీ పోలీసు లతో కూడా సమన్వయం చేస్తోంది.
ప్రజలకు జాగ్రత్తలు: పోలీసుల సూచనలు
హైదరాబాద్ పోలీసులు ప్రజలకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద వాహనాలు/వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండని కోరారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, రూమర్లు షేర్ చేయకండి. వెరిఫై చేసి మాత్రమే పోస్ట్ చేయండన్నారు.
మాల్స్, మార్కెట్లు, మెట్రోలో బ్యాగ్‌లు, వాహనాలు తనిఖీలకు సహకరించాలన్నారు. పేలుడు సందేహం ఉంటే ప్రదేశాన్ని వదిలి వెళ్లాలని, ఫైర్ ఆలారమ్‌లు ఆన్ చేయండని సూచించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ముమ్మర తనిఖీలు
డిల్లీలో పేలుడు నేపద్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ముమ్మర తనిఖీలు జరిపారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో ఎయిర్‌పోర్టు అధికారు లు తనిఖీలు నిర్వహించారు . ఎయిర్ పోర్ట్‌లోకి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి అనుమతి ఇస్తున్నారు. అను మానం వచ్చిన వాహనాన్ని వాహనంలోని లగేజీ బ్యాగ్‌లను తీసి మరీ తనిఖీలు చేపట్టారు. ఎవరైన అనుమానితులు అనిపిస్తే వారిని ప్రశ్నిస్తున్నా రు. తనిఖీలో సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ, ఎయిర్ పోర్ట్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గోన్నాయి.