రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. సోమవారం మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. రాజ్ తరుణ్, అజయ్ ఘోష్, రాశి సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.