ముంబై: రానున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో జట్టు సభ్యులు తమ లోపాలను సరిదిద్దు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్‌నకు కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలివుందని, ఇలాంటి స్థితిలో ప్రతి ఆటగాడు వైఫల్యాలపై దృష్టి సారించాల్సిందేనని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ ఆట తీరు తనను ఆందోళన గురి చేసిందన్నాడు. ఇలాంటి ఆటతో వరల్డ్‌కప్ వంటి మెగా ట్రోఫీని సాధించడం చాలా కష్టమైన అంశమన్నాడు. జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్ లేమీతో బాధపడుతున్నారన్నాడు.
అంతేగాక చాలా మంది క్రికెటర్లు పూర్తి ఫిట్‌నెస్‌తో లేరన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో కీలక ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్ కలవరానికి గురి చేస్తుందన్నాడు. ప్రపంచకప్ కోసం పూర్తిగా సన్నద్ధమవ్వాలని, ఫిట్‌నెస్ పరంగా సిద్ధంగా ఉండాలని గంభీర్ పేర్కొన్నాడు. ఇక గంభీర్ ఆటగాళ్లతో మాట్లాడిన వీడియో క్లిప్‌ను బిసిసిఐ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో గంభీర్ టీమిండియా సభ్యులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చాడు. అంతేగాక కొంత మంది కీలక ఆటగాళ్ల ఆట తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గంభీర్ వీడియో వైరల్‌గా మారింది.