మిర్యాలగూడ పట్టణంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. క్షణికావేశంలో చేసే పనికి ,విచ్చలవిడితనానికి నిదర్శనంగా నెలలు నిండని పసికందు మృతదేహం డ్రైనేజీలో కనిపించింది. మిర్యాలగూడ సబ్ జైల్ రోడ్డులో నెలలు నిండని ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కవర్ లో పెట్టి డ్రైనేజీ కాలువలో పడేయగా,కుక్కలు నోట్లో పెట్టుకుని పీక్కుతింటున్న దృశ్యం చూపరులను కలచివేసింది. వెంటనే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు శిశువు మృతిపై ఐడిఎస్ అధికారులకు ఫిర్యాదు చేశామని,ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ఒకటవ పట్టణ సిఐ తెలిపారు. ఈ ఘటనపై అధికారులు అంగన్వాడీలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.