హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘#SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ రివీల్.. నవంబర్ 15వ తేదీన రామోజీ ఫిలిమ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్‌లో జరగనుంది. ‘GlobeTrotter’ అనే పేరుతో జరిగే ఈ ఈవెంట్ కోసం మహేశ్ అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా ఈ ఈవెంట్ ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ప్రియాంక చోప్రా రంగంలోకి దిగింది. ఈ ఈవెంట్‌కు సంబంధించి ప్రియాంక ఓ వీడియోని విడుదల చేసింది. ‘నేనెందుకు ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉంటున్నానో నవంబర్ 15న తెలుస్తోంది. మాతో జాయిన్ అవ్వండి. ఈ ఈవెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని ప్రియాంక వీడియో ద్వారా తెలిపింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి సోమవారం ఓ అప్‌డేట్ విడుదలైంది. ఈ చిత్రం కోసం నటి శృతిహాసన్ పాడిన పాటను సైలంట్‌గా విడుదల చేసింది. చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే పాత్రలో నటిస్తున్నారని ఆయన ఫస్ట్‌లుక్‌లో పేర్కొన్నారు. ఇక నవంబర్ 15వ తేదీన జరిగే ఈవెంట్‌తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
She’s been everywhere 😉
And now @priyankachopra is here to tell you why this is the one event you can’t miss…#GlobeTrotter #GlobeTrotterEvent @ssrajamouli @urstrulyMahesh @PrithviOfficial @mmkeeravaani @SriDurgaArts @SBbySSK @thetrilight @JioHotstar pic.twitter.com/AZyfQBlO62
— Sri Durga Arts (@SriDurgaArts) November 10, 2025