మన తెలంగాణ/జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు సోమవారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత మరో పదిమంది కూడా వాంతులు అవుతున్నాయని తెలపడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తము జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పాఠశాల పంపించి చికిత్స అందించారు. పచ్చి పులుసు తీసుకోవడం వలన కొంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతోఅస్వస్థతకు గురైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. జమ్మికుంట ప్రభుత్వ బాలికల పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వికటించిన ఘటన పట్ల మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ హాస్టళ్లు,పా ఠశాలల్లో భోజన నిర్వహణ ను ప్రభుత్వం గాలికొదిలేసినట్టు ఇటీవల జరిగిన ఘటనలు రుజువు చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలోనే ప్రభుత్వం , అధికార యంత్రాంగం హడావిడి చేయడం ఆ తర్వాత మర్చిపోవడమే ఇందుకు కారణమన్నారు. తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు తలెత్తుతున్నప్పటికీ నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఆస్పత్రిలో చేరిన 17 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లు,పాఠశాలలను ప్రక్షాళన చేయాలని, నిరంతర బాధ్యతాయుత పర్యవేక్షణ చేపట్టాలని, విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బాధితులను పరామర్శించిన వారిలో మాజీ మున్సిపల్ ఛైర్మెన్ రాజేశ్వర్ రావు, సొసైటీ ఛైర్మెన్ పొనగంటి సంపత్ మాజీ మున్సిపల్ సభ్యులు తదితరులు ఉన్నారు.