మన తెలంగాణ/ఇల్లందు టౌన్: పురుగుల మందు తాగి నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని లచ్చగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్ధ్థానికుల తెలిపిన వివరాల ప్రకారం…. మృతురాలు కమటం అంజలికి అదే గ్రామానికి చెందిన చిట్టూరి సాయికుమార్‌తో ఆరునెలల క్రితం వివాహం జరిగింది. భర్త సాయికుమార్ హైద్రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది.
అత్తమామల వద్ద ఉన్న అంజలి కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన అత్తింటి వారు హుటాహుటిన ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన చికిత్సకోసం ఖమ్మంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అంజలి మృతి చెందింది. ఇకపోతే అత్తింటి వేధింపులతోనే తమ కూతురు మరణించిందని అంజలి తల్లిదండ్రులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.