అమరావతి: కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో విషాదం చోటు చేసుకుంది. చైతన్య పాఠశాల హాస్టల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అనారోగ్యంగా ఉందని రిమ్స్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా.. ఈ మృతిని పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.