హైదరాబాద్: అందెశ్రీని సోమవారం ఉదయం 7.20 నిమిషాలకు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యుడు సునీల్ కుమార్ తెలిపారు. అప్పటికే గుండెపోటుతో అందెశ్రీ చనిపోయారని, ఆయన నెల రోజుల నుంచి మందులు వాడటం లేదని తెలిసిందన్నారు. గత రాత్రి భోజనం చేశాక మామూలుగానే వెళ్లి పడుకున్నారని కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. కాసేపట్లో అందెశ్రీ భౌతికకాయానికి సిఎం నివాళులర్పించనున్నారు. అందెశ్రీ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో జరపాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు. ఆయన అంత్యక్రియాల ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో అందెశ్రీ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ సిఎం కెసిఆర్,న మంత్రులు, ఎంఎల్ఎ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.