కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్ జిగ్రీస్. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. జిగ్రీస్ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల మాట్లాడుతూ.. ‘ఇది యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ప్రతి సన్నివేశాన్ని చూసి హిలేరియస్‌గా నవ్వుకుంటారు. ఫ్యామిలీతో కలిసి జిగ్రీస్‌కి వెళ్ళండి. సినిమాను ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు. నిర్మాత కృష్ణ వోడపల్లి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని చాలా కష్టపడి తీశాం. సినిమా ఎంత హిలేరియస్‌గా ఉంటుందో అంత ఎమోషనల్‌గా ఉంటుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి పక్కా, చిట్టెం వినయ్ పాల్గొన్నారు.