అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో దారుణం జరిగింది. తల్లి, తమ్ముడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… సుంకరపద్దయ్య వీధిలో మహాలక్ష్మి అనే తల్లికి ఇద్దరు కుమారులు రవితేజ(33), శ్రీనివాసరావులు ఉన్నారు. శ్రీనివాసరావుకు మతిస్థిమితం సరిగా లేదు. సోమవారం తెల్లవారుజామున శ్రీనివాసరావు కత్తి తీసుకొని తల్లి, తమ్ముడిపై దాడి చేశాడు. వాళ్లు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే దారుణంగా నరకడంతో వారు ఘటనా స్థలంలో మరణించారు. గంట తరువాత పోలీసులకు శ్రీనివాసరావు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.