పాట్నా: బిహార్ రాష్ట్రం పాట్నా జిల్లా అకిల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానస్ గ్రామంలో పాత ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మానస్ గ్రామంలో బాబుఖాన్, రోషన్ ఖటూన్ అనే దంపతలు తమ పిల్లలు మహ్మద్ చంద్, రుక్సార్, చండ్నీ కలిసి ఉంటున్నారు. 30 సంవత్సరాల క్రితం ఇందిరా అవాస్ యోజనలో నిర్మించిన ఇంట్లో వారు ఉంటున్నారు. ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఆదివారం రాత్రి భోజనం చేసిన తరువాత సదరు కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. ఒక్కసారిగా వారిపై భవనం కప్పు కూలింది. గ్రామస్థులు వెంటనే శిథిలాల నుంచి వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతి చెందారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సదరు గ్రామంలో30 ఏళ్లు కిత్రం ఇందిరా అవాస్ యోజన కింద ప్రభుత్వం ఇండ్లు నిర్మించింది. ఇప్పుడు ఆ ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ౩౦ ఏళ్ల కిత్రం ఇచ్చి ఇండ్లు మాత్రమే ఉన్నాయి, కొత్త ఆ గ్రామం ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.