ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఆదివారం చిత్రంలోని రెండో పాట ‘పెళ్లి షురూ’ని హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేశారు. ఇది ఆనందోత్సాహాలతో నిండిన పెళ్లి సాంగ్. హీరో-హీరోయిన్ల వివాహ వేడుకల ఉత్సాహాన్ని, సంబరాన్ని మెలోడీ లియాన్ జేమ్స్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాట వినగానే మనసును కట్టిపడేస్తుంది. ప్రియదర్శి, ఆనంది ఇద్దరూ బ్యూటిఫుల్ డ్యాన్స్ మూవ్స్‌తో పాటకు జీవం పోశారు.