హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో అందెశ్రీ ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి వచ్చేలోపే ఆయన కన్నుమూశారని వైద్యులు వెల్లడించారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్రపోషించారు. మాయమైపోతున్నడమ్మా అనే మనిషి గీతంతో ఆయన పేరు మార్మోగిపోయింది. పాఠశాలకు వెళ్లకుండానే ఆయన కవిగా రాణించారు.