నాగ్‌పూర్: ఆర్‌ఎస్‌ఎస్ సార్వత్రిక సంస్థ. ఇందులోకి తీసుకునేది బ్రాహ్మణులు, ముస్లింలు, క్రిస్టియన్లను ఇతర వర్గాలను కాదని, హిందువులనే అని ప్రధాన సంచాలక్ మోహన్ భగవత్ తెలిపారు. హిందువు అంటే మతం కిందికి రాదు. భారతదేశంలో నివసించే వారంతా హిందువులే అవుతారని భగవత్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల ప్రస్థానం ముందున్న ఆవిష్కరణల ప్రసంగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌లోకి రావాలనుకునే వారు ముందు తమ తమ వేర్పాటువాద గుర్తింపులను వదులుకుని రావల్సిందే. కేవలం హిందువుగానే ఇందులో చేరాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భారత మాత ముద్దుబిడ్డలమనే ఏకైక ప్రకటనతో వచ్చేవారే ఆర్‌ఎస్‌ఎస్ అంతర్భాగం అవుతారని తేల్చిచెప్పారు.