మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్‌లో సందడి చేశారు. రెహమాన్ కాన్సర్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. అతిథులుగా హాజరైన రామ్‌చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా ఆడియన్స్‌లో మరింత జోష్ నింపారు. ‘పెద్ది’ సినిమాలోని చికిరి చికిరి లైవ్ పర్ఫామెన్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమై స్పందన వచ్చింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారా యి.
ఈ సందర్భం గా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘రెహమాన్ సంగీతంలో భాగమవ్వాలనేది నా చిన్నప్పటి కల. అది ‘పెద్ది’తో నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఇక చికిరి పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమా బ్యానర్‌పై భారీ స్థా యిలో నిర్మిస్తున్న ‘పెద్ది’ 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.