యంగ్ హీరో శ్రీనందు తన తాజా మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ ద్వారా మేకర్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
టీజర్ హై ఎనర్జీతో అదిరిపోయింది. దర్శకుడు వరుణ్ రెడ్డి యువతను దృష్టిలో ఉంచుకుని కథను రూపొందించాడు, శ్రీ నందు పాత్రను హై ఎనర్జీతో ఎంటర్‌టైనింగ్ చేశారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదల కానుంది. మార్కెటింగ్‌ను రానా స్పిరిట్ మీడియా నిర్వహిస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ నందు మాట్లాడుతూ “ఈ సినిమాలో ఫన్‌ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అంతా కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ కూడా కూడా నచ్చే సినిమా. అందరికీ నచ్చే యూనిక్ ఫన్ ఎంటర్‌టైనర్ ఇది”అని అన్నారు. డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ “చాలా కొత్తగా అనిపించే సినిమా ఇది. ఈ సినిమాతో నందులోని ఒక కొత్త యాంగిల్ చూస్తారు”అని తెలిపారు.