అమరావతి: అత్త వేధింపులు ఎక్కువ కావడంతో యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆమెపై కోడలు పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 98వ వార్డు అప్పన్నపాలెం వర్షిణి ఆపార్ట్‌మెంట్ ఎఫ్ బ్లాకులో కనకమహాలక్ష్మి (66) అనే వృద్ధురాలు తన కుమారుడు, కోడలితో కలిసి ఉంటుంది. అత్త తన భర్తకు లేనిపోనివి చాడీలు చెప్పి తనని వేదిస్తుందని కోడలు పగ పెంచుకుంది. అత్తను చంపడానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది. ‘హౌటు కిల్ ఓల్డ్ లేడీ’ అని సెర్చ్ చేసింది. నవంబర్ 6న సాయంత్రం పెట్రోల్ తీసుకొని వచ్చి ఇంట్లో దాచి పెట్టింది. నవంబర్ 7న ఉదయం 8 గంటలకు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. లలిత తల్లి స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లింది. ఇదే సరైన సమయం అనుకొని పిల్లలను అత్తతో దాగుడు మూతలు ఆట ఆడుకోవాలని సూచించింది. అత్తను చైర్‌లో కూర్చొబెట్టి కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లు, నోటికి గంతలు కట్టేసి దాక్కోమ్మని పిల్లలకు చెప్పింది. పిల్లలను గదిలోనికి పంపించిన తరువాత అత్తపై కోడలు పెట్రోల్ పోసి తగలబెట్టింది.
అత్త అరుపులు బయటకు వినపడకుండా టివి సౌండ్ పెద్దదిగా పెట్టింది. మంటలకు కట్లు కాలిపోవడంతో చైర్‌లో నుంచి వృద్ధురాలి లేచి దేవుడి రూమ్ వైపుకు పరుగులు తీసింది. మనవరాలికి కూడా మంటలు అంటుకోవడంతో చేతులు, కాళ్లు కాలిపోయాయి. టివి వైర్లు తగిలి నాన్నమ్మకు మంటలు అంటుకున్నాయని పిల్లలకు చెప్పింది. బాత్రూమ్‌లో నుంచి లలిత తల్లి బయటకు వచ్చేసరికి కనకమహాలక్ష్మి కాలిపోయి కనిపించింది. ఎదురింట్లో ఎసి బిగిస్తున్న వ్యక్తి మంటలను ఆర్పడానికి ఇంట్లోకి పరుగెత్తుకొచ్చాడు. అతడిని ఇంట్లోకి రానివ్వకుండా కోడలు ఆపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులున ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎసి బిగిస్తున్న వ్యక్తిని వివరాలు పోలీసులు అడిగి తీసుకున్నారు. వెంటనే ఆమె ఫోన్ తీసుకొని యూట్యూబ్‌లో హిస్టరీలో ఓపెన్ చేశారు. ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడీ’ అని ఆమె పలుమార్లు సెర్చ్ చేసినట్టు గుర్తించారు. కోడలిని అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించారు. తనని అత్త వేధించడంతోనే హత్య చేశానని కోడలు ఒప్పుకుంది. వెంటనే ఆమెపై పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.