మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాబడి తక్కువగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన అవకాశాలు చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది జాగ్రత్త వహించండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు ఎల్లో. వృషభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు అత్యవసరమైతేతప్ప చేయకుండా ఉండటం మంచిది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఇక కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఇంట బయట కొన్ని చికాకులు ఏర్పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి కుబేర కుంకుమతో అమ్మవారిని స్వామివారిని పూజించండి. నూతనవ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రీన్.
మిధున రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరుగుతుంది. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా అభివృద్ధి సాధిస్తారు. అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడతాయి. పోటీపరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. బంధు వర్గంతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. సంతాన సంబంధిత విషయం వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసివచ్చే రంగు గ్రీన్.
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. చాలాకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సినీ కళా రంగాలలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. దైవ దర్శనాలు చేసుకుంటారు. విందు వినోదాలల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. భూ వివాదాలు తీరుతాయి. హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గో సేవ చేస్తారు. ఈరాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు తెలుపు.
సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. ఏ కార్యక్రమం మొదలు పెట్టిన పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు స్నేహితులకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు అనుకున్నట్టుగా నలుగురిలో పేరు ప్రఖ్యాతలు పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆలోచన నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటేతొలగిపోతాయి. ఈ రాశి వారికి సమయానికి ధనం చేతికి అందుతుంది. మీరు ప్రయత్నం పూర్వకంగా మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం నెరవేరుతుంది. పది మందికి సహాయం చేసే గుణం ఉంటుంది. భార్య భర్తల మధ్య ఉన్న చిన్నపాటి ఇబ్బందులు తొలిగిపోతాయి. వ్యాపార రీత్యా రావలసిన బెనిఫిట్స్ కూడా వస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. అదే విధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు గత వారం కంటే కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండటం మంచిది. అదేవిధంగా లాయర్స్ కి డాక్టర్స్ కి చార్టెడ్ అకౌంట్ వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగం వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రేమ వివాహాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు పనికిరావు దాని వల్ల కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో ట్రాన్స్ఫర్ గురించి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పుడో పెట్టుబడి పెట్టిన వాటికి కూడా మంచి లాభం వస్తుంది. వీరు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇస్తే తిరిగి రాదు కావున అవసరమైతే తప్ప ఎవరికీ ఇవ్వరాదు లేదంటే సేవింగ్స్ రూపంలో వెళ్లడం మంచిది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ వెండి మీద కానీ పెట్టండి కలిసి వస్తుంది. షేర్ మార్కెట్ కి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపరాధన చేయటం అలాగే మొగలి పువ్వు కుంకుమతో ఆరావళి కుంకుమ తో అమ్మవారిని స్వామివారిని ఆరాధించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్యా రాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబ పరంగా లేదా సామాజికపరంగా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పదవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అవసరమైతే తప్ప కొనకపోవడం మంచిది. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా బాగా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు దేవదర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా నరాల సంబంధిత మరియు జలుబు సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడతాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. కన్సల్టెన్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అడ్మినిస్ట్రేషన్ వైద్య వృత్తిలో ఉన్నవారికి మార్కెటింగ్ పరికరాలకు సంబంధించిన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. స్టీలు మరియు ఐరన్ ఈ రంగాల వారికి చాలా బాగా అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి కొంత ఇబ్బంది కరమైన వాతావరణం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు అవార్డులు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతాయి. ఈ రాశి వారు శివుడికి అభిషేకం కానీ ప్రతిరోజు ఓం నమశివాయ జపం 108 సార్లు కానీ చేయటం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. భవిష్యత్తు కార్యాచరణ కోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఎంత అవసరమో అంతే పెట్టుబడి పెట్టండి. క్రయ విక్రయాలకు సంబంధించిన లాభాలు కూడా బాగున్నాయి. స్థలాన్ని కానీ ఇంటిని గాని కొనుగోలు చేస్తారు. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదరటం అలాగే చేజారిపోయిన సంబంధాలు కూడా తిరిగి రావటం జరుగుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. మీ వల్ల పదిమందికి ఉపయోగం ఉంటుంది కానీ వారి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపరాధన చేయండి అలాగే ఉదయం సాయంత్రం ఆరావళి కుంకుమతో మొగలిపువ్వు కుంకుమతో ప్రతిరోజు స్వామివారిని అమ్మవారిని ఆరాధించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే.
తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వృత్తివ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. రావలసిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కొంతవరకు రుణాలు తీర్చగలుగుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఆరోగ్య రీత్యా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గైనిక్ మరియు గ్యాస్టిక్ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది పేరు ప్రఖ్యాతలు అధికంగా సంపాదిస్తారు. కానీ ధనం వచ్చినట్టే వచ్చి ఖర్చవుతుంది. దైవానుగ్రహం వల్ల కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశీ విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నాలు ఇప్పటినుంచే ప్రారంభించండి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. స్నేహితులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది మంచివారు ఎవరో చెడ్డ వారు ఎవరో ముందే గ్రహించండి. ఏదైనా సరే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదు జాగ్రత్త వహించాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా మీకున్న ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఈ కార్తీకమాసంలో రుద్రాభిషేకం కానీ శివ నామస్మరణ కాని చేయండి మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపరాధన చేయటం మంచిది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు బ్లూ.
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఎక్కడికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధనం అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటినుంచో పడుతున్న బాధలకు ఇప్పుడు ముగింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎక్కువగా లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి సంతానం మంచి ఆరోగ్యంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఆధ్యాత్మికంగానూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దైవ దర్శనాలు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలు చేయగలుగుతారు. పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి. రాదు అనుకునే ధనం చేతికి అందుతుంది దాని ద్వారా శుభకార్యాలు కూడా చేస్తారు. అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఒక ఇల్లు గాని ఫ్లాట్ గాని కొనుగోలు చేస్తారు. పర్సనల్ లోన్స్ కు దూరంగా ఉండటం మంచిది. పదిమందిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దక్షిణా మూర్తి రూపును మెడలో ధరించండి మంచి జరుగుతుంది. ఆరోగ్యరీత్యా ఉన్నా చిన్నచిన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ప్రేమ వ్యవహరాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. చదువు మీద శ్రద్ధ కొనసాగించండి. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. గతంలో కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు ప్రారంభించండి కాలం అనుకూలంగా ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వతులతో దీపరాధన చేయటం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు గ్రే.
ధనస్సు రాశి వారికి ఈ వారం చాలు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. అందరితో కలిసి మెలిసి ఉంటూ మన పని మనం చేసుకోవటం మంచిది. ఎవరు మనవారు ఎవరు పరాయివారు తెలుసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు ముందుకు వెనక్కి ఉంటూ అంత ఆశాజనకంగా ఉండవు. వినాయకుడికి దండం పెట్టుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. ఎవరు ఎన్ని చెప్పినా మీరు సొంత నిర్ణయాలను మాత్రమే పాటించండి. విదేశీ సంబంధిత వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. పనులు నిదానంగా సాగిన చివరకు సక్రమంగా పూర్తవుతాయి ఓపిక వహించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు పెట్టుకుంటే ఒకవేళ ఇంట్లో వారితోనే పెట్టుకోండి కలిసి వస్తాయి బయట వారితో కలిసి రావు. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కాలమని చెప్పవచ్చు. అనుకోని పదవులు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. సినీ కళా రంగాల వారికి అడ్మినిస్ట్రేషన్ వారికి ఫైనాన్సు సెక్టార్ లో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయటం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు.
మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా మంచి లాభాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించు కుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం వల్ల ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆరోగ్యరీత్యా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగి పోతాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి కొంత ఊరట లభిస్తుంది. ఉద్యోగం పోతుందేమో అనుకునే వారికి స్థిరత్వం ఉంటుంది . అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా గడిచిన కొంతకాలం కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంబంధం కూడా కుదురుతుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్మోటిక్స్, స్టీలు రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి లాయర్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నెగిటివ్ గా ఆలోచించడం మానేసి పాజిటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి అంతా మంచే జరుగుతుంది. విదేశీ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ఆర్మీలో ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు అండదండలు బాగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతాన కోసం ప్రయత్నం చేసే వారు మంచి శుభవార్తను వింటారు. సంతానయోగం ఉన్నది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు కూడా ప్రారంభించ వచ్చు. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు గ్రే.
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు అనుకున్న పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలో మీకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. గో సేవ చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి._విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. శుభకార్యాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు అవుతుంది. మీ కార్తీకమాసంలో ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నీవే బ్లూ.
మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన విషయాలలో వాగ్దానాలు, మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు పనికిరావు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతోనువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్.