కారులో గంజాయి తరలిస్తున్న హోంగార్డును ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది రామోజీ ఫిలిం సిటీ వద్ద శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 15.33కిలోల గంజాయి, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రం, మల్కాన్‌గిరికి చెందిన నీలంబర్ మీర్కన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన ఉమాకాంత్ నాగర్ తన వద్ద ఉన్న గంజాయి 15.33కిలోలను హైదరాబాద్‌లో ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పడంతో దానికి హోంగార్డు అంగీకరించాడు. గంజాయి తీసుకుని తన కారులో హోంగార్డు నీలంబర్ మీర్కన్, సోనా కాలా బయలుదేరారు.
ఈ విషయం ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బందికి తెలియడంతో రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో వస్తున్న నీలంబర్‌ను ఆపి కారులో తనిఖీ చేయగా గంజాయి లభించలేదు. కారు డిక్కీలో ఉన్న స్టెఫిన్ టైర్‌పై అనుమానం రావడంతో దానిని బయటికి తీసి తనిఖీ చేయాగా నాలుగు గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిబ్బందిని కేసు దర్యాప్తు కోసం హయత్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. డిఎస్పి తులా శ్రీనివాసరావు తదితరులు తనిఖీలు నిర్వహించారు.