హైదరాబాద్: వరంగల్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఆగిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిపై రోగుల ఒత్తిడి పెరిగిందని అన్నారు. వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని కవిత సందర్శించారు. వరద బాదితులను పరామర్శించారు. తదుపరి హనుమకొండ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు, మంత్రులున్నా ఫలితం లేదని విమర్శించారు. ఆస్పత్రిని బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఎవరు నిర్లక్ష్యం చేసినా తప్పేనని మండిపడ్డారు. బిఆర్ఎస్ హయాంలో సమస్యలు తీరక.. ఇప్పుడూ తీరకపోతే ఎలా? అని కవిత ప్రశ్నించారు. తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, రాజకీయాలు ఎన్నికలు జరిగే చివరి ఏడాదిలో చేసుకుందాం అని తెలియజేశారు. తన పర్యటనల ద్వారా ప్రజలకు పైసా మేలు జరిగినా తన జన్మ ధన్యమైనట్లేనని కవి త పేర్కొన్నారు.