హైదరాబాద్: ఓటర్లు ఈ ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. పొన్నం ప్రభాకర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని తెలియజేశారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్దికి పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారని, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్ కు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. నవంబర్ 11వ తేదీన జరిగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కోసం ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు దినం ప్రకటించిందన్నారు. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పొన్నం పేర్కొన్నారు.