హైదరాబాద్: నిజాయితీగా చెప్పాలంటే తనని లోతుగా అర్థం చేసుకునే వ్యక్తి భాగస్వామిగా వస్తే బాగుంటుందని హీరోయిన్ రష్మిక మందనా తెలిపారు. మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారని ఓ అభిమాని రష్మికను ప్రశ్నించడంతో ఆమె నవ్వుతూ జవాబిచ్చారు. ప్రతి విషయాన్ని తనపై వైపు నుంచి ఆలోచన చేయడంతో పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తి కావాలని చెప్పారు. తన కోసం యుద్ధం చేసే వ్యక్తి కవాలని, అలాంటి భాగస్వామని కోసం తాను తుపాకీ తూటాకైనా ఎదురెళ్తానని స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా నిలబడిన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నానని వివరణ ఇచ్చాడు. నెల రోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని రెండు కుటుంబాలు బయటకు చెప్పలేదు. రష్మిక మాత్రం పరోక్షంగా సమాధానం ఇచ్చారు. తన నిశ్చితార్థం విషయం అభిమానులు ఏం అనుకుంటున్నారో అదే నిజం అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని పేర్కొన్నారు. 2026లో విజయ్‌తో రిష్మిక పెళ్లి జరుగనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక అద్భుతంగా నటనతో మెరిసిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.