ఇటు సౌత్, అటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకు పోతున్న రష్మిక మందన్న నటించిన సినిమా ’ది గర్ల్ ఫ్రెండ్’. ఇప్పటివరకు పలు కమర్షి యల్ సినిమాలతో మెప్పించిన ఈ భామ ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి ప్రయోగాత్మక సినిమా చేసింది. నటుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం శుక్రవారం మంచి అంచ నాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ అంచనాలను సినిమా ఏమేరకు అందుకుందో చూద్దాం.
కథ: భూమా (రష్మిక) హైదరాబాదులోని ఓ కాలేజీలో ఎంఏ ఇంగ్లీ ష్ లిటరేచర్ కోర్సులో చేరుతు ంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చదువుతుంటాడు. అతడిని దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) ఇష్టపడుతుంది. కానీ దీక్షిత్.. భూమాతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె వెంట తిరిగి తనూ ప్రేమలో పడే లా చేస్తాడు. ఒక రకమైన అయోమ య స్థితిలో విక్రమ్ తో ప్రేమలోకి వె ళ్తుంది భూమా. కానీ ప్రేమలో పడ్డాక విక్రమ్ పెట్టే కండిషన్లు.. తన ప్రవర్తనతో భూమా ఇబ్బంది పడుతుంది. మరి విక్రమ్ తో భూమా బంధం ఏమేర నిలబడింది.. చివరికి వీళ్లిద్దరి జీవితాలు ఏ మలుపు తీసుకున్నాయి.. అన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ: ఈ లవ్ స్టోరీ ప్రేమికులు అందరికీ నచ్చదు. కేవలం తక్కువ మందికి మాత్రమే సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కథా, కథనాలు మిగతా వారికి అంతగా రుచించకపోవచ్చు. రెం డు విభిన్నమైన పాత్రలు భూమా, విక్రమ్ లవ్ ట్రాక్ కొన్నిసార్లు బోర్ కొట్టిస్తుంది. పలు సన్నివేశాల్లో అక్కడక్కడా సాగదీత ఫీలింగ్ కలుగుతుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ భూమా పాత్ర ఉంటుంది. ఏం చేస్తోందో, ఏం చేయాలో తెలియని సందిగ్థ స్థితి ఆమెది. ఇందు లో భూమా పాత్ర పట్ల ఎవరికీ కనీసం సానుభూతి కూడా కలగదు. ఏమిటీ ఇలా ప్రవర్తిస్తోందనే చికాకు కలుగుతుంది. కొన్ని సన్నివేశాలతో కొందరికి తీవ్రమైన అసహనం కలగొచ్చు. హీరో తల్లికి.. కథానాయికకు మధ్య వచ్చే సన్నివేశం కూడా ఈ కోవకు చెందిందే. ఇలాంటి హార్డ్ హిట్టింగ్ సీన్లు నచ్చడం.. నచ్చకపోవడాన్ని బట్టి సినిమా రుచిస్తుందా లేదా అన్నది చెప్పొచ్చు. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి తమ నటనతో ఆకట్టుకున్నారు. అను ఇమ్మాన్యూల్, ప్రొఫెసర్ పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్ ఓకే అనిపించారు. మొత్తానికి ‘ది గర్ల్ ఫ్రెండ్’ అందరినీ అలరించే సినిమా కాదు.