మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు చీడ పురుగుల్లా అభివృద్ధి కి అడ్డుపడుతూ బ్యాడ్ బ్రదర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని సిఎం రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను ఓడించాలని, బిజెపికి డిపాజిట్ దక్కరాదని ఆయన ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రేవంత్‌రెడ్డి శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడు తూ బిఆర్‌ఎస్, బిజెపిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీ న్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004-2014 మధ్య కాలంలో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అ భివృద్ధి చెందిందని తెలిపారు. ఓఆర్‌ఆర్, శంషాబాద్ విమానాశ్ర యం, మెట్రో రైలు ఇంకా ఎన్నెన్నో పథకాలను తీసుకుని వచ్చామని ఆయన వివరించారు.
కాగా 2014 నుంచి కేంద్రంలో బిజెపి, రా ష్ట్రంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి చేసింది శూ న్యమని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో ఎటువంటి అభివృ ద్ధి జరగలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రూ. 16 వేల కో ట్ల మిగులు బడ్జెట్ ఉందన్నారు. 2023 సంవత్సరంలో కెసిఆర్ తెలంగాణను ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్‌కు ప్రభుత్వా న్ని అప్పగించారని ఆయన తెలిపారు. గతంలో ఐటిఐఆర్‌ను కూడా మంజూరు చేసి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదని ఆయన తెలిపారు. వరదలు వచ్చి హైదరాబాద్ నీట మునిగితే కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అణాపైసా కూడా లేదని ఆయన దుయ్యబట్టారు. అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా పేదల ఆస్తులు కోల్పోయి నష్టం జరిగితే వారికి ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.
బిఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం, కమాండ్ కంట్రోలు, సచివాలయం, ప్రగతి భవన్ నిర్మించారని, దీని వల్ల పేదలకు ఏమైనా ఉపయోగపడిందా? అని ఆయన ప్రశ్నించారు. కుమారున్ని సిఎం చేయడానికే, వాస్తు సరిగ్గా లేదన్న భావనతో మంచిగా ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తగా నిర్మించారని ఆయన విమర్శించారు. దీంతో కొత్త ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. విపక్షాలపై, మీడియా వారిపై నిఘా పెట్టేందుకే బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోలు పెట్టారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళలో కూలిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్, కెటిఆర్ మెట్రో రైలును పొడిగించలేదని, ఎల్‌అండ్‌టిని బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేశారని ఆయన విమర్శించారు. మెట్రో విస్తరణకు రూ. 73 వేల కోట్లతో ప్రణాళికను కేంద్రానికి ఇచ్చామని ఆయన చెప్పారు. గతంలో కాంగ్రెస్ నేతలు పి. జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం పోరాడితే వారికి ‘హైదరాబాద్ బ్రదర్స్’ మంచి పేరు లభిస్తే, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కెటిఆర్ అభివృద్ధికి అడ్డుపడుతున్నందున బ్యాడ్ బ్రదర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన విమర్శించారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ప్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్‌కు ఇరవై టిఎంసిల జలాలు తేవాలనుకుంటే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇంకా ఫైవోవర్ల నిర్మాణం, అండర్ పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లకూ అడ్డుపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్‌లో ఉన్న కంటోన్మెంట్ నుంచి శామీర్‌పేట్, మేడ్చల్‌కు, ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతి తెచ్చి ఐదు వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామని ఆయన వివరించారు. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండాలన్న ఆలోచనతో 2047 విజన్ డాక్యుమెంట్‌తో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలు లోక్‌సభ ఎన్నికలతోనే సరిపోయిందన్నారు. మిగిలిన సంవత్సరంన్నర కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేగలిగామని అన్నారు. లక్ష కోట్ల ఆదాయం లభించే ఓఆర్‌ఆర్‌ను ఏడు వేల కోట్ల రూపాయలకు గత ప్రభుత్వం అమ్ముకున్నదని ఆయన దుయ్యబట్టారు. దీపావళి రోజున డ్రగ్స్ పట్టుబడిన వారిని ఏమనాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పట్టుబడిన వ్యక్తి కెటిఆర్‌కు సన్నిహితుడని ఆయన తెలిపారు. స్కూల్ పిల్లలకు డ్రగ్స్ చాక్లెట్లు విక్రయించారని ఆయన చెప్పారు. మద్యం తాగితే పట్టుబడ్డ వారికి జరిమానా, జైలు శిక్ష ఉంది కానీ గంజాయి సేవించిన వారికి శిక్ష లేదన్నారు. ఈ విషయమై తాము వచ్చే అసెంబ్లీలో చర్చించి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో నలభై నాలుగు చెరువులను కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. అంబర్‌పేటలో బతకమ్మ కుంటను కాపాడడమే కాకుండా అది ప్రజలకు ఉపయోగపడేలా చేశామని ఆయన తెలిపారు.
ఈ కుంటను బిఆర్‌ఎస్‌కు చెందిన నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆక్రమించారని, దీనికి ఏమని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. నాగార్జునకు ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకపోతే ఎన్-కన్వెన్షన్‌ను కూల్చి వేసామని ఆయన తెలిపారు. అహ్మదాబాద్‌లో సబర్మతి ప్రక్షాళన, యూపీలో యమునా నది ప్రక్షాళన చేశారని, అయితే నగరంలో మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. అడుగడుగునా అవినీతి జరిగిందని, చివరకు యాదగిరి గుట్ట, కోవిడ్‌ను కూడా వదలలేదని ఆయన విమర్శించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూం నిర్మించుకున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తాను ప్రస్తుతం ఆ నివాసంలో ఉంటున్న డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్కను అడిగి తెలుసుకున్నానని అన్నారు. గతంలో సద్దాం హుస్సేన్‌కు ప్రాణ భయం ఉండేదని, దీంతో తనలాగే పోలిక ఉన్న ఆరుగురిని తయారు చేయించి, ముందుకు ఏదైనా కార్యక్రమానికి పంపించే వారని దీంతో దుండగులు దాడి చేసేందుకు అవకాశం ఉండేది కాదట అని చదివానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆగర్భ శ్రీమంతులు టివీలు, పేపర్లను స్థాపించారని ఆయన విమర్శించారు. ప్రజలను ఎంత కాలం మభ్య పెడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మాగంటి గోపి మరణంపై..
మాగంటి గోపినాథ్ మరణంపై రాజకీయాలు చేయవద్దని ఆయన కోరారు. అయితే మాగంటి గోపి తల్లి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా గోపి మరణంపై మాట్లాడడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, బండి సంజయ్ మాదాపూర్ పోలీసు స్టేషన్లో, లేదా డిజిపికి లేఖ రాసినా విచారణ జరిపిస్తామన్నారు. గద్దరన్న అవార్డులను ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.