న్యూఢిల్లీ: జాతీయగీతం వందేమాతరంలోని ము ఖ్యమైన చరణాలను 1937లో తొలగించారని, ఈ పరిణామంతో దేశ విభజనకు బీజాలు నాటారని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. జాతీయగీ తం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా జరిగే కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై స్పష్టమైన దాడి చేశారు. అటువంటి విభజన మనస్తత్వం ఇప్పటికీ దేశానికి ఓ పెను సవాల్ గానే ఉందని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని జాతీయగీతం స్మారక ప్రత్యేక స్టాంప్‌ను, నాణేన్ని కూడా విడుదల చేశారు. వందేమాతరం గీతం భారత స్వా తంత్ర పోరాట స్వరంగా మారింది. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి మంత్రం అయింది. ప్రతిభారతీయుడి భావాలకు అద్దంపట్టింది. దురదృష్టవశా త్తూ, 1937లో ఆ గీతంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారు. దీంతో దాని ఆత్మను తొలగించినట్లు అయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
జాతి నిర్మాణంలో మహామంత్రం అయిన గీతం లో ముఖ్యమైన భాగాలు తొలగింపుతో విభజన బీ జాలు నాటుకున్నాయని, ఈ అన్యాయం ఎందుకు జరిగిందో నేటితరం తెలుసుకోవాలని ఆయన అ న్నారు. ఈ విభజన మనస్తత్వం, ఇప్పటికీ దేశానికి ఓ సవాలుగా ఉందని మోదీ పేర్కొన్నారు. వందేమాతరం కేవలం స్వాతంత్ర పోరాట నినాదం కా దని, ప్రతి యుగంలోనూ, ప్రతి తరంతోనూ సం బంధించినదిగా ఉంటుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రధాని ప్రస్తావిస్తూ, శత్రువులు ఉగ్రవాదాన్ని ఉపయోగించి మన భద్రత, గౌరవం పై దాడి చేసేందుకు సాహసించినప్పుడు , భారతదేశం దుర్గా రూపాన్ని ఎలా ఆవిష్కరించు కుం టుందో ప్రపంచం చూసిందని ప్రధాని అన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అది ప్రజలకు కొత్త ప్రేరణ ఇ స్తుందని, కొత్త శక్తిని, ఉత్తేజాన్ని నింపుతుందని ఆ యన అన్నారు. వందేమాతరం అనేది గొప్ప పదం, ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల,ఒక సంకల్పం, ఇది భరతమాత పట్ల భక్తి, ఆరాధన. ఇది మనల్ని మన చరిత్రతో అనుసంధానిస్తుంది అని ప్రధాని ఉ ద్ఘాటించారు. అంతే కాదు మన భవిష్యత్ కు కొత్త ధైర్యాన్ని ఇస్తుందన్నారు.
భారతదేశం సాధించలేని సంకల్పం లేదు. భారతీయులు సాధించలేని ల క్ష్యంలేదు. అంటూ, విజ్ఞానం, సైన్స్, టెక్నాలజీ ఆ ధారంగా ప్రపంచంలోనే అత్యున్నత దేశాన్ని మ నం నిర్మించుకోవాలని ఆయన వివరించారు. 20 25 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకూ దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా వందేమాతరం 150వ వార్షికోత్సవాలను ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్పూర్తిగా నిలిచిన మహా గీతం వందేమాతరం. మహాకవి, రచయిత బంకిం చంద్ర ఛట ర్జీ 1875 నవంబర్ 7న ఈ గీతాన్ని రాశారు.