శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం 60 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరి వెళతాయని పేర్కొంది. చర్లపల్లి, నర్సాపూర్, మచిలీపట్నం స్టేషన్ల నుండి రైళ్లు రాకపోకలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ రైళ్లు నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పలు తేదీల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నవంబరు 17, 24 తేదీల్లో, డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాంకు రైళ్లు నడుస్తాయి. నవంబరు 19, 26 తేదీల్లో, డిసెంబరు 3, 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లాం నుంచి చర్లపల్లికి రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు పగిడిపల్లి, గుంటూరు, గూడురు, రేణిగుంట మీదుగా వెళతాయని తెలిపింది. నవంబరు 16, 23, 30 తేదీల్లో, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో, జనవరి 4, 11, 18 తేదీల్లో నర్సాపూర్ నుంచి కొల్లాంకు మరికొన్ని రైళ్లు తిరుగుతాయి.
నవంబరు 18, 25, 30 తేదీల్లో, డిసెంబరు 9, 16, 23, 30 తేదీల్లో, జనవరి 6, 13, 20 తేదీల్లో కొల్లాం నుంచి నర్సాపూర్కు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా వెళతాయి. నవంబరు 14, 21, 28 తేదీల్లో, డిసెంబరు 26, జనవరి 02 తేదీల్లో మచిలీపట్నం నుంచి కొల్లాంకు రైళ్లు నడుస్తాయి. నవంబరు 16, 23, 30 తేదీల్లో, డిసెంబరు 28, జనవరి 04 తేదీల్లో కొల్లాం నుంచి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. డిసెంబరు 05, 12, 19 తేదీల్లో, జనవరి 09, 16 తేదీల్లో మచిలీపట్నం నుంచి కొల్లాంకు, డిసెంబరు 7, 14, 21 తేదీల్లో, జనవరి 11, 18 తేదీల్లో కొల్లాం నుంచి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గుంటూరు, నంద్యాల, కడప, రేణిగుంట మీదుగా వెళతాయి.