న్యూఢిల్లీ: పాకిస్థాన్ రహస్య అణుపరీక్షలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. రహస్య, చట్టవిరుద్ధ అణు కార్యకలాపాల చరిత్ర పాక్‌కు ఉందని తెలిపింది. స్మగ్లింగ్, ఎగుమతి ఉల్లంఘన, రహస్య భాగస్వామ్యాలు తెలిశాయని పేర్కొంది. పాక్ అణు కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి చెబుతున్నాం అని చెప్పింది. పాక్ అణు పరీక్ష గురించి ట్రంప్ మాటలను నిశితంగా గమనిస్తున్నామంది. భారత్‌లో ట్రంప్ పర్యటనపై మా వద్ద సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.