కామారెడ్డి: అతి చిన్న వయస్సులోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన తెలంగాణకు మలావత్ పూర్ణకు పితృ వియోగం కలిగింది. ఆమె తండ్రి దేవీదాస్ (50) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కామారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు స్వస్థలమైన నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం పాకాలలో నిర్వహించనున్నారు.
మన రాష్ట్రానికి చెందిన మలావత్ పూర్ణ 13 సంవత్సరాల 11 నెలల వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. తద్వారా అతి చిన్న వయససులోనే ఈ ఫీట్ సాధించి రికార్డు సృష్టించింది. ఆమె 2014 మే 25న ఈ ఘటన సాధించింది. పూర్ణ ఏడు ఖండాలలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి ఎందరికో స్పూర్తిగా నిలిచింది.