దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘‘#SSMB29’’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి హైప్ మామూలుగా లేదు. ఎప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ లాకెట్‌తో సినిమా నుంచి చిన్న అప్‌డేట్ ఇచ్చారు రాజమౌళి. నవంబర్‌లో సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తామని తెలిపారు.
అయితే నవంబర్ రావడంతో 1వ తేదీన మహేశ్, రాజమౌళి మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ లుక్‌ని విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. ఒకేఒక్క ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలను పెంచేశారు రాజమౌళి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే పాత్రలో కనిపించనున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఒక #GlobeTrotterగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అతి పెద్ద ఈవెంట్ ఈ నెల 15న జరగనుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.