లక్నో: సోషల్ మీడియాలో పరిచయమైన ఏడో తరగతి విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏడో తరగతి చదువుతున్న బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఉంది. విమల్ యాదవ్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ప్రతి రోజు ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. ఒక రోజు కలుద్దామని బాలికను వినయ్ అడిగాడు. దీంతో ఇద్దరు ఒక స్థలంలో కలిశారు. వినయ్‌తో పియుష్ మిశ్రా, సుభమ్ శుక్లా కూడా ఉన్నారు. స్కార్పియో కారులో బాలికతో కలిసి తిరిగారు. ఐఐఎం రోడ్డులో బాలికను ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అనంతరం బాలికను ఫోన్ ను లాక్కొని బయట పడేశారు. బాలికను హోటల్ రూమ్‌లో బంధించి రెండు రోజులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాలిక ఇంటి వద్ద కారులో డ్రాప్ చేసి నిందితులు పారిపోయారు. బాలిక తనపై జరిగిన విషయం తల్లికి చెప్పడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల పోక్సో యాక్టు కింది నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రియుష్, శుభమ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విమల్ యాదవ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.