న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోడీ తనకు ప్రియు మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. పిఎం మోడీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం తగ్గించారని పేర్కొన్నారు. బరువు తగ్గించే మందుల ధరలను తగ్గించడానికి భారత్‌తో కొత్త ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇండియాతో వాణిజ్య చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తాను భారత్‌కు వెళ్లిన తరువాత మోడీతో చర్చలు జరుపుతానని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం భారత్‌లో పర్యటించాలని మీరు అనుకుంటున్నారా? అని జర్నలిస్టు ప్రశ్నించడంతో అవునని ట్రంప్ సమాధానం ఇచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ భారత్ పర్యటన స్పందించడం గమనార్హం. ఫార్మా కంపెనీలతో ఒప్పందం జరుగుతుండగా ట్రంప్ పక్కను ఉన్న ఓ ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్ గోర్డాన్ ఫైండ్లే స్పృహతప్పి కిందపడిపోయాడు. దీంతో ఈ కార్యక్రమానికి కొంతసేపు అంతరాయం ఏర్పడింది.