హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను అగ్ర దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి గుడ్ న్యూస్ చెపాపరు. రాజమౌళి దర్శకత్వంలో #SSMB29 అనే క్రేజీ ప్రాజెక్టు రూపొందుతుంది. ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా ఎప్పుడు అపడేట్ ఇస్తారా అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని తెలిసిందే. నేడు ఆయన లుక్‌ను విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించారు. ఈ సందర్భంగా రాజమౌళి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నవంబర్ 15న జరిగే ఈవెంట్‌ను అందరూ చాలా ఎంజాయ్ చేస్తారన్నారు. మూవీలో మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ జరుగుతోందని వివరణ ఇచ్చారు. #GlobeTrotter ఈవెంట్ కోసం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆ రోజు కోసం తాను ఎదురుచూస్తున్నానని, దానికంటే ముందు అభిమానులు ఈ వారమంతా మరింత హుషారుగా ఉండేందుకు పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తానని పేర్కొన్నారు.