యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘మఫ్తీ పోలీస్’ చిత్రాన్ని నిర్మాత జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్.ఆర్ట్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించారు. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అర్జున్ ఇంటెన్స్ లుక్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. ఇప్పటికే విడుదలైన టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఈ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.