మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మనదేనని, కాంగ్రెస్ జెండా పాతాలని సిఎం రేవంత్‌రెడ్డి డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముం దు కు సాగుతోందని, ఈ నేపథ్యంలోనే ప్రతి అం శాన్ని అనుకూలంగా మలుచుకోవాలని, అ హర్నిశలు శ్రమించాలని, అందరూ అ ప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూ చించారు. ఈ క్రమంలోనే తాజాగా జూబ్లీహి ల్స్ ఉప ఎన్నిక, ప్రచార సరళిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువా రం జూబ్లీహిల్స్ లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులతో ఇప్పటి వరకు సాగిన ప్రచారంపై సిఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసిసి వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మన అభ్యర్థి గెలవబోతున్నారని మంత్రులు, పార్టీ నాయకులందరూ మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. బిఆర్‌ఎస్,
బిజెపి పార్టీలు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా బిఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని ఆయన సూచించారు. మంత్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోజుకో సర్వేను వదులుతూ ప్రజలను, ఓటర్లను బిఆర్‌ఎస్ సోషల్ మీడియా గందరగోళానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఫీల్డ్‌లో కాంగ్రెస్‌కు బలం ఉందని, నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. ప్రచారానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉందని, ఈ రోజు నుంచి ప్రతి గంట సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఓటరుకు మన వాయిస్ చేరాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు. మూడురోజుల ప్రణాళికల గురించి సిఎం వారికి సూచించారు. ప్రతి డివిజన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించాలని యువ ఓటర్లను ఆకర్శించే విధంగా సోషల్‌మీడియాను బలోపేతం చేయాలని, బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుకోవాలని సిఎం పేర్కొన్నారు.