మన తెలంగాణ/రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ కెన్‌వర్త్ అపార్ట్‌మెంట్ మత్తు మందు ప్రియులకు అడ్డగా మా రింది. ఆ మత్తే వారి జీవితాలను చిత్తు చేస్తుండ డం స్థానికులను కలవరానికి గు రి చేస్తుంది. దాంతో పలు కు టుంబాలు సురక్షితంగా భావించి నివాసం ఉంటున్న కెన్ వర్త్ ఆపార్ట్ మెంట్ ప్రాంగాణాన్ని తమకు అనువు గా సహజీవనానికి పాల్పడుతున్న కొందరు అనుకులంగా మార్చుకుని అధిక మోతాదులో మత్తు మందు స్వీకరించి ప్రాణాలు కోల్పోతుండడం కలకలం రేపుతోంది. ఇటీవల ఓ ఎయిర్ హోస్టేస్ ప్రియుడితో కలసి జరుపుకున్న బర్త్ డే పార్టీలో అనుమానా స్పదంగా ప్రాణాలు కోల్పోగా తాజాగా గురువారం వెలుగు చేసిన సంఘటన ఆందోళనకరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్లు ఉన్నా యి. అందులోని ఫ్లాట్ నెంబర్ 805 లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ అత ని స్నేహితుడితోపాటు మరో ఇద్దరు యువతులతో కలసి లివింగ్ రిలేషన్షిప్‌లో నివాసం ఉంటున్నాడు.
కాగా బుధవారం రాత్రి అహ్మద్ అలీ తన స్నేహితుడితోపాటు మరో ఇద్దరు అమ్మాయిలతో కలసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు. మత్తుకు బానిసగా మారిన పార్టీలో అధిక మోతాదులో మాదక ద్రవ్యం స్వీకరించిన అహ్మద్ అలీ (28) అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అపార్ట్మెంట్ వాసులు ఇచ్చిన సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే పరిశీలించగా అప్పటికే అహ్మద్ అలీ మృతి చెందాడు. పోలీసుల విచారణలో గత రాత్రి అహ్మద్ అలీ తో మరో యువకుడు ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అధికంగా డ్రగ్స్ వాడడం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్ ఓవర్ డోస్ వల్ల అహ్మద్ అలీ మరణించగా, అతని తో పాటు ఉంటున్న మరో ఇద్దరికీ పాజిటివ్ రాగా, మరో అమ్మాయికి నెగటివ్ వచ్చింది.