మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ నుంచి షూటింగ్ వరకు పలు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తారక్‌పై ఓ కొత్త లుక్‌ను ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలీ హకీమ్‌తో సిద్ధం చేయిస్తుండగా దీనిని దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఇలా కొత్త లుక్‌తో కొత్త షెడ్యూల్ కి రంగం సిద్ధం చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఎన్టీఆర్ లోని బీస్ట్ మోడ్ చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.
ఈ భారీ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. అయితే ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా సమయం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.