కీవ్: రష్యాలోని వోల్గోగ్రేడ్ రీజియన్ లోని భారీ చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు బుధవారం దాడి చేశాయి. గత మూడు నెలల్లో ఇది రెండో దాడిగా ఉక్రెయిన్ ప్రభుత్వ సిబ్బంది గురువారం తెలిపారు. రష్యా మొత్తం రిఫైనరీ సామర్ధంలో 5.6 శాతం ఉన్న ఈ రిఫైనరీ ఏటా 15 మిలియన్ టన్నుల ముడిచమురును ఉత్పత్తి చేస్తుంది. రష్యా యుద్ధానికి అవసరమైన చమురు ఎగుమతుల ఆదాయాన్ని అందకుండా చేయడానికే రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడి చేస్తోంది.