బెంగళూరు: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కె.జి.ఎఫ్’. ఈ సినిమాలో ప్రతీ పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. అయితే కె.జి.ఎఫ్ అభిమానులకు ఇది చేధు వార్త. ఈ సినిమాలో ఖాసిం ఛాఛాగా నటించి అందరిని మెప్పించిన హరీశ్ రాయ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న గురువారంె తుదిశ్వాస విడిచారు.
1995లో వచ్చిన ‘ఓం’ సినిమాలో డాన్ రాయ్‌గా ఆయన నటించారు. మూడు సంవత్సరాల క్రితం హరీశ్ తన ఆరోగ్యం గురించి చెప్పుకొని బాధపడ్డారు. తనకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. కొందరు హీరోలు సాయం చేశారు కూడా.
‘‘పరిస్థితులు కొన్నిసార్లు మాత్రమే మనకు అనుకూలంగా ఉంటాయి. విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నా. కెజిఎఫ్‌లో నేను గడ్డంతో కనిపించడానాకి ఓ కారణం ఉంది. క్యాన్సర్ కారణంగా నా గొంతు వాచిపోయింది. అది కనిపించకుండా ఉండేందుకే గడ్డం పెంచాను’’ అని హరీశ్ గతంలో చెప్పారు.