క్వీన్స్‌లాండ్: భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టి20లో టీమిండియా 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 88 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 28 పరుగులు చేసి జంపా బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అభిషేక్- గిల్ తొలి వికెట్ పై 40 బంతుల్లో 56 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(34), శివమ్ దూబే(17) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే సిరీస్‌లో ఇరు జట్లు చెరో ఒక మ్యాచ్ గెలిచాయి.