జగద్గిరిగుట్ట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోషన్ కుమార్ సింగ్(22)జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ బాలశౌర్ రెడ్డి(21)తోపాటు సహకరించిన ఇద్దరు నిందితులు సయ్యద్ మహ్మద్(28), రేవో ఆదిత్య(26)లను అరెస్టు చేశామని బాలానగర్ డిసిపి కోటి రెడ్డి తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన రోషన్ కుమార్ సింగ్(22) గతంలో పలు కేసుల్లో నిందుతుడుగా ఉన్నాడు. ఇతని పై బాలానగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉందని వివరించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక ద్వి చక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌జెండర్‌ను అత్యాచారం చేసి డబ్బు చెల్లించే విషయంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య గొడవ జరడంతో ఒకరిని కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే.