భోపాల్: భార్యపై అనుమానంతో ఆమె ముక్కు భర్త కోసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఝుబా జిల్లాలో రానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పడలా గ్రామంలో రాకేశ్(23), గీతా బాయ్(22) అనే దంపతులు నివసిస్తున్నారు. గుజరాత్‌లో దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెతో భర్త గొడవకు దిగేవాడు. ఇద్దరు సొంతూరుకు వచ్చారు. ఆమెతో విడాకులు తీసుకుంటానని భర్త తన పలుమార్లు భార్యకు చెప్పాడు. మంగళవారం భర్త మద్యం సేవించి భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో బ్లేడ్ తీసుకొని భార్య ముక్కు కోశాడు. అనంతరం చేతులపై గాయాలు చేశాడు. కర్ర తీసుకొని ఆమెను చితకబాదాడు. స్థానికులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ముక్కు భాగం కిందపడిపోవడంతో కుక్కలు తిని ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ అవసరం అవుతుందని వైద్యులు తెలిపారు.